సాధారణంగా మార్కెట్లలో తీసుకునే పండ్లు, కూరగాయలు చూడటానికి బాగానే కనిపిస్తాయి గానీ.. అవి అంత శుభ్రంగా మాత్రం వుండవు. కొంతలో కొంతైనా మానవుని శరీరానికి హాని కలిగించే బ్యాక్టీరియాలు వాటిమీద కచ్చితంగా వుంటాయి.
అటువంటి సమయాల్లో వాటిని కొన్ని పద్ధుతుల ద్వారా శుభ్రపరిస్తే.. అందులో వుండే బ్యాక్టీరియాలు పూర్తిగా తొలగిపోయి.. తాజాగా వుంటాయి. అలాకాకుండా నేరుగా వాటిని వంటకాల్లో ఉపయోగిస్తే మాత్రం అది ఫుడ్ పాయిజన్’కు దారితీస్తుంది. కాబట్టి.. పండ్లను, కూరగాయలను శుభ్రం చేయడం శ్రేయస్కరం.
ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్’ను వాష్ చేసే చిట్కాలు :
1. అన్నిటికంటే ముందుగా చేతులను సోప్’తోగానీ ఇతర డిటెర్జెంట్’లతోగానీ శుభ్రంగా వాష్ చేసుకోవాలి.
2. తినడానికి తెచ్చుకున్న పండ్లు, కూరగాయలను కోల్డ్ రన్నింగ్ వాటర్’లో వేసి బాగా శుభ్రం చేసుకోవాలి. సోపులు, డిటర్జెంట్లు ఉపయోగించాల్సి అవసరం లేదు. నీటితో మాత్రమే శుభ్రం చేస్తే చాలు.
3. పండ్ల విషయాలకొస్తే.. ఆపిల్స్, పీయర్స్, పిచెస్ వంటివాటిని తినడానికి ముందు పొట్లు తొలగించుకుంటే మంచిది. అలాకాకపోతే.. నీటిలో శుభ్రంగా కడిగి.. పొడి వస్త్రంతో నీటుగా తుడుచుకోవాలి. తడి ఆరిపోయే వరకు పొడిగా వున్న న్యూస్ పేపర్ లేదా పేపర్ టవల్ మీద వేయడం వల్ల బ్యాక్టీరియా తొలిగిపోతుంది.
4. సాధారణంగా పండ్లను, కూరగాయలను శుభ్రం చేసుకోవడానికి మార్కెట్లలో కొన్నిరకాల బ్రష్’లు లభ్యమవుతాయి. ఆ బ్రష్’ల ద్వారా ఆ పదార్థాలను సర్ఫేస్’లతో స్కబ్ చేసుకున్న అనంతరం కట్ చేసుకొని తీసుకోవచ్చు.
5. కట్ చేసుకున్న పండ్లు, కూరగాయలను ఏదైనా పాత్రలో నిల్వవుంచడానికి ముందుగా.. ఆ పాత్రలను కూడా నీటుగా కడిగేసుకోవాలి.
6. నీళ్లు జోరుగా వచ్చే ట్యాప్ కింద పండ్లను, కూరగాయాలను శుభ్రం చేయడం చాలా మంచిది. ఎక్కువ ప్రెజర్’తో నీళ్లు రావడం వల్ల ఆ దెబ్బకు వాటిమీద వుండే బ్యాక్టీరియాలు నాశనమవుతాయి.
7. బ్రొకోలీ, కాలీఫ్లవర్’లతోబాటు మరికొన్ని పదార్థాలను ముందుగా నీటిలో నిల్వవుంచిన అనంతరం శుభ్రం చేసుకోవాల్సి వుంటుంది. కొంతసమయం నానబెట్టి.. తర్వాత కడిగేసుకోవాలి.
8. ఇలా ఈ విధంగా ఒక్కొక్క విధానాన్ని సరిగ్గా పాటిస్తే.. పదార్థాలను శుభ్రం చేసుకోవచ్చు.