ఏవైనా మాంసపు పదార్థాలను నిత్యం తాజాగా వుంచాలంటే.. ముందుగా వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఫ్రిజ్’లో పెట్టాల్సి వుంటుంది. ఒకరోజు తర్వాత కూడా వాటిని వాడుకోవచ్చు. అయితే ఎలా పడితే అలా క్లీన్ చేయకూడదు.. అందుకు సంబంధించి కొన్ని చిట్కాలను పాటించాల్సి వుంటుంది.
చికెన్, మటన్ లాంటి విషయాలకొస్తే.. ముందుగా వాటిని చిన్నచిన్న ముక్కలుగా కోసుకున్న తర్వాత ఆ ముక్కల్లో వున్న అనవసరమైన వేస్టేజ్’ని తొలగించాల్సి వుంటుంది. ఆ తర్వాత మరోసారి నీటిలో శుభ్రంగా కడిగి.. ఫ్రిజ్’లో పెట్టేయొచ్చు. దానిని కావాలంటే రెండురోజుల తర్వాత ఏదైనా కూరలో వాడుకోవచ్చు.
అయితే చేపల విషయానికొస్తే.. వాటిని శుభ్రపరిచే విదానం కాస్త డిఫరెంట్’గా వుంటుంది. ఉప్పు, వెనిగర్ వంటి పదార్థాలతో చేపలను క్లీన్ చేయాలి. చేపలపై వున్న పొట్ట తీస్తున్నప్పుడు ఉప్పు, వెనిగర్ వేస్తే.. శుభ్రంగా తొలగించొచ్చు. పొట్ట తీసిన అనంతరం ముక్కలుగా కట్ చేసుకుని నీటిలో శుభ్రంగా కడిగేసుకోవాలి.
అలా కడిగిన ఆ ముక్కలకు ఉప్పు, వెనిగర్ తదితర పదార్థాలను బాగా పట్టించాలి. ముక్కలకు అన్నివైపులా పట్టేలా జాగ్రత్తలు పాటించాలి. అనంతరం వాటిని ఒక పాత్రలో పెట్టేసి, ఫ్రిజ్’లో వుంచాలి. ఇలా చేస్తే.. ఓ వారంరోజుల వరకైనా చేపలు ఫ్రెష్’గానే వుంటాయి. ఫ్రీజ్ అయిపోయిన చేప ముక్కలుగా సులభంగా రెండు ముక్కలుగా చేసుకుని, వండుకోవచ్చు.