చికెన్-65 రిసిపీని మాంసాహారప్రియులు ఎంతో ఇష్టంగా తింటారు. ఎందుకంటే.. చికెన్ రిసిపీలన్నింటిలోకెల్లా ఇదెంతో రుచికరంగా వుంటుంది. అయితే చికెన్ కంటే ఎక్కువ పోషకవిలువలను కలిగి వున్న ఫిష్’తో ఈ విధమైన రిసిపీని చేసుకుంటే.. రుచితోబాటు ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు.
సీఫుల్’లో ఓమేగా 2 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా వుంటాయి. ఇవి గుండె సంబంధిత వ్యాధుల నుంచి దూరంగా వుంచడంల ప్రముఖపాత్రను పోషిస్తాయి. కాబట్టి.. చేపలు ఎంత ఎక్కువ తింటే ఆరోగ్యానికి అంతే మంచిది. చేపలతో ఎన్నోరకాల వంటకాలు వున్నాయి కానీ.. కాస్త వెరైటీగా ఫిష్ -65ని తింటే అదింకా రుచిగా వుంటుంది. మరి దీన్నేలా చేస్తారో తెలుసుకుందామా...
ఈ ఫిష్-65 తయారీకి కావలసిన పదార్థాలు ముందుగా సేకరించుకోవాలి. అవి : చేపముక్కలు, పెప్పర్, మైదా, గుడ్లు, అల్లంవెల్లుల్లి పేస్ట్, కారం, గరంమసాలా, ధనియాలపొడి, ఉప్పు, నూనె తదితర పదార్థాలను రిసిపీకి తయారీకి తగినట్లు తీసుకోవాలి.
తయారీవిధానం :
1. ముందుగా చేపముక్కలను పైన పొట్టులేకుండా శుభ్రం చేసుకోవాలి. తర్వాత వీటికి కాస్త ఉప్పు పట్టించి ఒక పాత్రలో పక్కన పెట్టేయాలి.
2. అల్లంవెల్లుల్లి పేస్ట్, కారం, గరంమసాలా పౌడర్, ధనియాలపొడి, పెప్పర్ తదితర పదార్థాలను ఒక బౌల్’లో వేసి బాగా కలుపుకోవాలి. అలాగే గుడ్డును పగలకొట్టి పచ్చసొనతోబాటు వేసి మిక్స్ చేయాలి.
3. అలా కలుపుకుతున్న ఆ మిశ్రమాన్ని చేపముక్కలన్నింటికీ కలుపుకోవాలి. అన్నివైపులా మసాలా తగిలేలా చూడాలి. ఇలా మసాలా పట్టించిన ముక్కలను అరగంటవరకు ఫ్రిజ్’లో పెట్టి.. తర్వాత బయటకు తీయాలి.
4. అనంతరం ఒక డీప్ ఫ్రైయింగ్ పాన్’ను తీసుకుని అందులో కాస్త నూనె వేసి వేడి చేయాలి. నూనె బాగా వేడయ్యాక అందులో ఇదివరకు మ్యారినేట్ చేసుకున్న చేపముక్కలను వేయాలి.
5. తక్కువ మంటమీద చేపముక్కలను అన్నివైపులా బ్రౌన్ కలర్’లోకి వచ్చేంతవరకూ దోరగా వేపుకోవాలి. అంతే! ఫిష్ 65 రిసిపీ రెడీ!