ప్రస్తుత ఆధునికయుగంలో దాదాపు ప్రతిఒక్కరు వంటకాల్లో నాన్ స్టిక్, స్టైన్లెస్ స్టీల్, అల్యూమినియంతో తయారు చేసిన పాత్రలనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే వీటిని తరుచుగా వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు కచ్చితంగా తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడిస్తున్నారు. అదే మట్టికుండల్లో చేసిన వంటకాలు తింటే మాత్రం నిరంతరం ఆరోగ్యంగా వుండొచ్చని నిర్థారిస్తున్నారు.
ఎందుకంటే.. మట్టిపాత్రల్లో వేడి నలువైపులా సరిసమానంగా వ్యాపించి, ఆ ఆవిరిలోనే వంటలు సగానికి సగం ఉడికిపోతాయి. ఇలా ఆవిరి ద్వారా ఉడికిన ఆహారమే ఆరోగ్యాన్ని మరింతగా మెరుగుపరుస్తుందని నిపుణులు అంటున్నారు. మట్టిపాత్రల్లో వండే వంటకాల్లో ఉప్పు, కారం, పులుపు వంటివి చేర్చితే ఎలా దుష్ర్పభావం వుండదని, శరీరంలో ఆహారం సులభంగానే జీర్ణమవుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.
అదే నాన్’స్టిక్ వంటి లోహసంబంధిత పాత్రల విషయానికొస్తే మాత్రం ఆరోగ్యపరంగా చాలా సమస్యలే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉప్పు, కారం, పులుపు చేర్చితే రకరకాల రోగాలబారిన పడాల్సి వస్తుందని.. ఆహారం సరిగ్గా ఉడకదని, జీర్ణం కూడా సరిగ్గా అవదని చెబుతున్నారు. కాబట్టి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవాలంటే మట్టికుండల్లో వంటకాలు చేసుకోవడమే చాలా మంచిది!