దేశంలో దోసెలకు ఏమేరకు డిమాండ్ వుందో అందరికీ తెలిసిందే! బియ్యపు పిండితో తయారయ్యే ఈ వంటకంలో ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషక విలువలు వుండటంతోబాటు ప్రత్యేకమైన రుచిని కలిగి వుంటాయి. ఇక వండటం కూడా సులభమే కాబట్టి.. చాలావరకు ఉదయాన్నే బ్రేక్’ఫాస్ట్’లో దీన్నే తీసుకోవడానికి ఇష్టపడతారు.
ఇక ఇళ్లల్లో అయితే మూడురోజులపాటు వచ్చేంతవరకు పిండిని తయారుచేసుకుని ముందుగానే పెట్టేసుకుంటారు. అయితే మొదటిరోజు వరకు పిండి బాగానే వుంటుంది కానీ.. రెండోరోజు వచ్చేసరికి కాస్త పులుపుగా, రంగు కూడా మారినట్లుగా అనిపిస్తుంది. ఇది ప్రతిఒక్కరికి ఎదురయ్యే సమస్యే! ఎందుకంటే.. దీన్ని ఒకరోజు ముందే తయారుచేయడంతోబాటు రెండురోజులు నిల్వవుంచడంతో ఇలాంటి మార్పులే సంభవిస్తాయి.
మరి.. దోసెల పిండి పులుపెక్కినప్పుడు ఏం చేయాలో తెలుసా? అలాంటప్పుడు ఒక భాగం పిండికి, పావుభాగం రవ్వతో ఉల్లిపాయ, మిరియాలు, జీలకర్ర, పచ్చిమిర్చిలను మిక్సీలో వేసి.. ఓ తిప్పు తిప్పి దోసె పిండిలో కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత వాటిని పెనుముపై వేస్తే.. అప్పుడు దోసెల నుంచి పులుపు వెళ్లిపోయి.. ఎంతో రుచిగా తయారవుతాయి.