ప్రతిఒక్కరు గారెలను ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా చలివాతావరణంలో అయితే వీటిని ప్రత్యేకంగా తయారుచేసుకుని తింటారు. వీటిని తింటున్నప్పుడు కరకరలాడితే.. అప్పుడు ఎంతో మజాగా అనిపిస్తుంది. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో గారెలు కరకరలాడవు. అలాకాకుండా గారెలు కరకరలాడాలంటే.. అందుకు కొన్ని చిట్కాలు అందుబాటులో వున్నాయి. అలాగే వీటిని ఎలా చేస్తారో తెలుసుకుందాం...
1. గారెలు కరకరలాడాలంటే గారెల పిండిలో కొంచెం సేమ్యాను కలపుకోవాలి.
2. మినపప్పు ఒక గంటలో నానాలంటే గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టుకోవాలి. .
3. పిండి పలుచగా ఉండి వడలు చేయడం కుదరకపోతే.. అప్పుడు ఆ పిండికి తగినంత బంగాళాదుంపలకు తురిమి అందులో కలపాలి. ఇలా చేస్తే వడలు కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉంటాయి.
4. పప్పు మాడినట్లుగా వాసన వస్తే దానిని వేరే గిన్నెలోకి మార్చి రెండు తమలపాకులు వేయాలి. అనంతరం మీడియం మంటమీద ఉడకబెడితే మాడు వాసన పోతుంది.
5. పాలు మరిగించేటప్పుడు మీగడ ఎక్కువగా, మందంగా కట్టాలంటే పాలుకాచే గిన్నెమీద, జల్లెడలాగా చిల్లులు వున్న మూతను వుంచాలి.