బ్రేక్’ఫాస్ట్’లో చేసుకునే వంటకాల్లో ఒకటైన పూరీలంటే.. అందరికీ ఎంతో ఇష్టం. రోజూ సాధారణ వంటకాలు తిని తిని బోర్ కొట్టినప్పుడు ఈ రకమైన వంటకాన్ని చేసుకుంటే.. కాస్త వెరైటీగా, టేస్టీగా వుంటుంది. అయితే వీటిని మరింత క్రిస్పీగా చేసుకుంటే.. ఇంకా మంచి మజా అందుతుంది. మరి ఇవి క్రిస్పీగా వుండాలంటే.. ఏం చేయాలో తెలుసా?
పూరీల కోసం సిద్ధం చేసుకున్న పిండిని గుండ్రంగా తయారుచేసుకుని దాన్ని కొద్దిసేపటివరకు ఫ్రిజ్’లో పెట్టాలి. ఇలా చేస్తే.. పూరీలను కాల్చే సమయంలో అవి నూనెను తక్కువగా పీల్చడంతోబాటు ఎంతో క్రిస్పీగా తయారవుతాయి. కాబట్టి.. రోజూ ఈ రకమైన చిట్కాను పాటిస్తే.. ఎంతో రుచికరమైన క్రిస్పీ పూరీలను సేవించవచ్చు.
మరో అద్భుతమైన చిట్కా : ఎక్కువరోజులు నిల్వవున్న శెనగపిండిని అనవసరంగా చెత్తలో పారేయకుండా దాన్ని పాత్రలు తోముకోవడానికి ఉపయోగించుకోవచ్చు. అలా ఉపయోగిస్తే.. గిన్నెలు మరింతగా మెరుస్తాయి. పైగా ఖర్చు కూడా తగ్గుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి!