ఉదయాన్నే బ్రేక్’ఫాస్ట్’లో ఇడ్లీలు తినేందుకు ప్రతిఒక్కరు ఇష్టపడతారు. ఇవి తినడానికి ఎంతో రుచికరంగా వుండటంతోబాటు.. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి కూడా! ఇందులో వుండే పోషకాలు నిత్యం ఉత్తేజంగా వుండేలా చేస్తాయి కూడా! అందుకే.. ప్రతిరోజూ సాధారణ వంటకాలను తినడం కన్నా.. సింపుల్’గా ఇడ్లీలను చేసుకుంటే ఎంతో శ్రేయస్కరం.
ఇకపోతే.. అప్పుడప్పుడు ఇడ్లీలు కాస్త గట్టిగా, మందంగా వుంటూ తినడానికి ఇబ్బందికరంగా అనిపిస్తుంటాయి. అలాంటి సమయంలో ఆ ఇడ్లీలు మృదువుగా రావాలంటే.. అందుకు ఓ సింపుల్ చిట్కా వుంది. అదేమిటంటే.. ఇడ్లీ రుబ్బే సమయంలో గుప్పెడు అటుకులుకానీ, గుప్పెడు అన్నంకానీ వేస్తే.. ఇడ్లీలు చాలా మృదువుగా, మరింత రుచిగా వస్తాయి. ఇలా ఒకసారి చేసి చూడండి!