* గ్యాస్ స్టవ్ రోజు ఒక్కసారి తడి బట్టతో తుడిస్తే ఎక్కువగా మురికి పట్టే అవకాశ0 ఉండదు,పూర్తిగా శుభ్ర పడుతుంది అలాగే కొద్దిగా సర్ఫ్ పౌడర్ తీసుకుని దానిలో కొద్దిగా నీళ్ళు కలిపి దానిలో గుడ్డ ముంచి తుడవాలి ఇలాగా చేస్తే నల్ల చీమలు రావు.
* స్టవ్ ని నిమ్మ చెక్క రసం పిండి మిగిలిన నిమ్మచేక్కతో కనుక రుద్దితే తుప్పు పట్టదు అలాగే నునే మరకలు పూర్తిగా పోతాయి.
* మిది ఇప్పుడు ఉన్న లేటెస్ట్ మోడల్ అయితే ఎక్కువగా పైన టాప్ ఉన్నవి వస్తున్నాయ్ అయితే దానినీ కోలిన్ అనే ఒక స్ప్రే ఉంటది అది తీసుకుని కొద్దిగా స్ప్రే చేసి తుడవాలి. ఇలాగా చేస్తే మురికి జిడ్డు పూర్తిగా పోతాయి
* ఎప్పుడైనా పాలు లేదా నునే లేదా మరిఎదైన ఒలికిపోతే స్టవ్ బర్నేర్ వేరు చేసి తుడవాలి లేకపోతే స్టవ్ బర్నర్ లో నీళ్ళు వెళ్ళిపోయి సరిగ్గా వెలగదు.
* ఎప్పటికి అప్పుడు గ్యాస్ పైప్ చూసుకోవాలి ఎందుకంటే గ్యాస్ లికేజి ఎక్కువగా జరిగేది గ్యాస్ పైప్ నుండే,దీనివల్ల గ్యాస్ ప్రమాదాలు జరుగుతాయి
* గ్యాస్ స్టవ్ కింద బల్లుల్లు ఉంటె కొద్దిగా కర్పూరం పొడి చల్లండి అప్పుడు అక్కడకి బల్లుల్లు ఎక్కువగా కనపడవు.
* ప్రతి 6 నెలలకు ఒకసారి సర్వీసింగ్ చేయించండి అప్పుడు స్టవ్ ఎక్కువ కాలం మన్నుతాయి