* బోరాక్స్ పౌడర్ ని మూడు భాగాలు, పంచదార ను ఒక భాగం గా తీసుకుని ఈ మిశ్రమాన్ని బొద్దింకలు ఉన్న చోట చల్లితే బొద్దింకలను కొన్ని గంటలలోనే నివారించవచ్చు. పంచదార కలిపిన ఈ మిశ్రమాన్ని బొద్దింకలు తినడం ద్వార అవి నాశనమౌతాయి.
* ఒక వేల ఇంట్లో చిన్న పిల్లలు లేదా పెంపుడు జంతువులు ఉండి బోరాక్స్ పౌడర్ ని వాడటం సురక్షితం కాదు అనుకుంటే బోరాక్స్ పౌడర్ బదులు బేకింగ్ సోడా మరియు పంచదార లను ఉపయోగించవచ్చు.
* సాధారణం గా ఉల్లిపాయలో ఒక ఘాటైన వాసన ఉంటుంది. ఉల్లిపాయలను తీసుకుని వాటి నుండి రసం తీసి బల్లులు తిరుగుతున్న గోడలమీద మరియు బొద్దింకలు సంచరిస్తున్న ప్రదేశాలలో చల్లడం లేదా స్ప్రే చేయడం వలన వీటిని నివారించడం తో పాటు మరే ఇతర క్రిమికీటకాలు ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయి.
* వెల్లుల్లి కూడా క్రిమి సంహారిని గా ఉపయోగించవచ్చు. వెల్లుల్లి లో ఉండే ఘాటైన వాసన బొద్దింకలను ఇంటి పరిసరాల్లోకి రాకుండా చేస్తుంది. వెల్లుల్లి రసాన్ని తీసుకుని ఇంట్లో మరియు ఇంటి పరిసరాల్లో స్ప్రే చేయటం వలన బొద్దింకలు మరియు బల్లులు రెండింటిని రాకుండా చేస్తుంది.
* కాఫీ గింజలను అలమరలలో , వంటగదులలో అక్కడక్కడ పెట్టడం ద్వారా బొద్దింకలు ఇంట్లో కి రాకుండా ఉంటాయి.
* వాడేసిన నిమ్మ తొక్కలను అలమరలలో ఉంచడం ద్వార బొద్దింకలు, చీమల బెడద నుండి తప్పించుకోవచ్చు.
* బిర్యాని ఆకు ని పొడి చేసుకుని ఆ పొడిని బొద్దింకలు తిరుగుతున్న ప్రదేశాల్లో చల్లడం ద్వార ఆ వాసన కు అవి చనిపోతాయి.
* మిరియాల పొడి, ఉల్లిపాయల, వెల్లుల్లి పేస్టు కలిపి ముద్ద గా చేసుకుని అక్కడక్కడ ఉంచడం వలన ఆ వాసన కు బొద్దింకలు మాయమౌతాయి.