గ్రిల్డ్ ఫుడ్స్.. అంటే కాల్చిన ఆహారపదార్థాలు. ఇవి తినడానికి ఎంతో ప్రత్యేకంగా, రుచికరంగా వుంటాయి. అందులో.. ఈ ఫుడ్ సెంటర్లు ఎక్కడున్నా.. అక్కడ జనాలు వాలిపోతుంటారు. వీటిని ఎల్లవేళలా బయటికి వెళ్లే తినడం కష్టం కాబట్టి.. ఇంట్లో తయారుచేసుకుంటే మంచిది. కానీ.. వీటిని ఇండ్లలో ఈ ఫుడ్ చేయడం కాస్త కష్టంతో కూడిన పని! ఇందుకు సంబంధించిన కొన్ని పరికరాలను ఖచ్చితంగా కొనుగోలు చేయాల్సి వుంటుంది. ఆ తర్వాత వీటిని చేయడానికి సులభం అవుతుంది.
గ్రిల్డ్ తయారుచేసే విధానం :
1. ముందుగా వంటగదికి సరిపడే ఒక ఎలక్ట్రికల్ గ్రిల్’ను కొనుగోలు చేయాల్సి వుంటుంది. ముఖ్యంగా వేడిని సెట్ చేసే సర్దుబాటు వున్న గ్రిల్ చూసుకుంటే మంచిది. మూత వున్న, లేని గ్రిల్స్ కూడా వుంటాయి. ఒకవేళ రెండువైపులా కాల్చుకోవడానికి వీలుగా వుండాలంటే మూతలేని గ్రిల్’ని తీసుకోవడం శ్రేయస్కరం.
2. జార్జ్ ఫోర్మేన్ వంటి రకాలను ఒకేసారి రెండువైపులా పదార్థాన్ని కాల్చడానికి గ్రిల్’పై భాగాన్ని పట్టేవిధంగా మూతవుండే గ్రిల్’ని తీసుకోవాలి. పదార్థాలు వేడెక్కుతున్న సమయంలో గ్రిల్లు నుంచి కొవ్వు, ఇతర కాల్చే పానీయాలు బయటికీ వస్తున్నాయా.. లేదా.. అన్నది తనఖీ చేస్తూ వుండాలి.
3. కరెంట్ గ్రిల్లును ఉపయోగించడానికి ఇష్టంలేనివారు గ్రిల్’ పాన్’ను వాడవచ్చు. ఇవి గ్యాస్ లేదా స్టౌవ్’లపై బాగా పనిచేస్తాయి. ఇవి ఇనుపపూతతో లేదా నాన్’స్టిక్ తరహాలో వుంటాయి.
ఇండోర్ గ్రిల్’ను ఉపయోగించడం :
1. ఈ గ్రిల్’లో ద్రవ పొగ చేర్చాల్సి వుంటుంది. దీన్ని కొద్దిగా ఉపయోగిస్తే.. బయట కాల్చిన ఆహారంలో వుండే పొగచూరు రుచే వస్తుంది. ఈ గ్రిల్’పై ముక్కలు, చికెన్, హాట్ డాగ్స్, బర్గర్లు, మొక్కజొన్నలు తదితర పదార్థాలను వుంచి కాల్చుకోవచ్చు. అయితే.. బయటచేసే విధానంకంటే ఇంట్లో చేసేటప్పుడు ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి.. వేడి చేసేటపపుడు థర్మామీటర్ సహాయం తీసుకుంటే వీలుగా వుంటుంది.
2. ఒకవేళ గ్రిల్’పై వంటకాలు చేసే ప్రక్రియలు తెలియకపోతే.. సోషల్ మీడియాలోగానీ, ఇతర పుస్తకాల్లోగానీ వాటి తయారీవిధానాలకు సంబంధించి ఎన్నో పుస్తకాలు లభ్యమవుతాయి. కానీ.. వీటిపై నాన్’స్టిక్ ఉపరితలమున్న పాత్రలు మాత్రం అస్సలు వాడకూడదు. డైరెక్టుగా గ్రిల్ మీదా ఆహారాన్ని వుంచకుండా దానిపై పూత పూయడం ముఖ్యం. పదార్థం నూనెను పీల్చేట్లుగా చూడాలి.