కిచెన్’లో కత్తి వినియోగం ఎంతో అత్యవసరమైంది. అది లేకపోతే.. దాదాపుగా కిచెన్’లో చాలా పనులు ఆగిపోతాయి. అంతేకాదు.. ఇతర కార్యకలాపాలు కూడా నిలిచిపోతాయి. అయితే కేవలం కిచెన్ వరకు మాత్రమే కాకుండా దీనిని మరిన్ని అవసరాలకోసం కూడా వినియోగించుకోవచ్చు. అవసరమైన పరిస్థితుల్లో కొన్ని వస్తువులు అందుబాటులో లేనప్పుడు.. ఇది ఉపయోగపడుతుంది. మరి కత్తితో కలిగే ఆ ఉపయోగాలేంటో తెలుసుకుందాం...
1. స్ర్కూడ్రైవర్’గా : కొన్ని సందర్భాల్లో ఇండ్లలో స్ర్కూడ్రైవర్స్ దొరకవు. అటువంటి సమయాల్లో కత్తి ఉపయోగపడుతుంది. కానీ.. దానిని వినియోగించే ముందు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి.
2. ఓపెన్ ప్యాకెట్స్ : మార్కెట్ల నుంచి తెచ్చుకునే ప్రతిఒక్క ప్యాకెట్’ను ఓపెన్ చేయడానికి వీలుగా కత్తి పనికొస్తుంది.
3. గార్డెన్’లో : గార్గెన్’లో దీని ఉపయోగం అమోఘం. మట్టి తవ్వడానికి, ఎరువు తియ్యడానికి, ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు నిర్వహించడానికి ఇది పనికొస్తుంది. ముఖ్యంగా చిన్నచిన్న పాట్స్’లలో మట్టి తియ్యడానికి పనికొస్తుంది.
4. ఓపెనర్’గా : ఏదైనా ఒక వస్తువును ఓపెన్ చేయడానికి అంటే.. బాటిల్, ఇతర మూతబడిన వస్తువులను తీసేందుకు ఇది సింపుల్’గా పనికొస్తుంది.