మాంసాహారాన్ని తినడానికి ప్రతిఒక్కరు ఆసక్తి చూపిస్తారు కానీ.. దానిని వండటం మాత్రం చాలామందికి తెలియదు. అలాంటి సమయాల్లో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే.. మాంసాన్ని వండే విధానాన్ని నేర్చుకోవచ్చు. మరికొంతమందికి మాంసాహారాన్ని తయారుచేసే విధానం తెలసి వుంటుంది కానీ... దానిని సక్రమంగా పాటించకపోవడం వల్ల కాస్త ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. అంటే.. కొన్ని సందర్భాల్లో మాంసం పచ్చిగా, గట్టిగానే ఉండిపోతుంది. అలాంటప్పుడు దానిని మెత్తగా ఉడికించాలంటే కొన్ని చిట్కాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాం...
1. సీ సాల్ట్ : మాంసం సరిగ్గా ఉడకనప్పుడు దాని మీద సీ సాల్ట్’ను చల్లి ఒక గంట తర్వాత ఉడికించుకోవాలి. సాధారణ ఉప్పు కంటే సీ సాల్ట్ ను ఉపయోగించడం వల్ల మాంస ముక్కల్లోనికి చొచ్చుకొని పోయి మెత్తబడేలా చేసి తిరిగి అదే ఆకృతి కలిగి ఉంటుంది.
2. టీ : ఇందులో మాంసాన్ని మెత్తబరిచే టానిక్ ఆమ్లం కలిగి ఉంటుంది. కాబట్టి ఇది సహజంగా మెత్తబడేలా చేస్తుంది. ఒకటి లేదా రెండు కప్పుల బ్లాక్ టీని తయారు చేసి చల్లారిన తర్వాత మాంసం ముక్కలకు పట్టించాలి. అరగంట తర్వాత ఉడికించాలి. అప్పుడు ముక్కలు మెత్తబడుతాయి.
3. వైన్, సిట్రస్ జ్యూస్, లేదా వెనిగర్ : నిమ్మ, నారింజ వంటి వాటిలో సిట్రిక్ ఆసిడ్ ఎక్కువగా వుంటుంది. అప్పుడు ఆ జ్యూస్’లను మాంసానికి పట్టించడం వల్ల మాంసపు కండర తంతువులు మృదువుగా మారుతాయి. టానిన్స్ గుణాలు కలిగినటువంటి రెడ్ వైన్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది.
4. టమోటో సాస్ : టమోటోలో ఆమ్లాగుణాలు అధికంగా ఉంటాయి కాబట్టి వీటితో తయారుచేసిన సాస్’ను మాంసం ముక్కలకు బాగా పట్టించిన అరగంట తర్వాత ఉడికించుకోవాలి. అలా చేస్తే మాంసపు ముక్కలు మెత్తబడుతాయి.
5. కోలా : ఇక్కడ కోలా అంటే డైట్ కోక్ కాదు.. సాధారణంగా లభించేది. మాంసం ముక్కలను కోలాతో మ్యారినేట్ చేసి అరగంట నుండి ఐదు ఆరు గంటలు నానబెట్టడం మల్ల మళ్లీ, ఆమ్ల ఉత్ప్రేరకం కలిగిస్తుంది. దాంతో ముక్కలు మెత్తబడుతాయి.
6. కాఫీ : స్ట్రాంగ్ కాఫీ చల్లబడిన తర్వాత గ్రిల్డ్ చేయడానికి ముందుగా మాంసానికి మ్యారినేట్ చేసి ఇరవై నాలుగు గంటల తర్వాత వండుకోవచ్చు.
7. పెరుగు : ఇందులో ఆమ్లత్వ గుణాలు ఎక్కువగా వుంటాయి. అలాగే ప్రోటీన్ విచ్ఛిన్నం ఉపయోగపడే కాల్షియం కంటెంట్, ఎంజైమ్’లను కలిగి ఉంటుంది. కాబట్టి దీనిని మాంసాన్ని మజ్జిగతో మ్యారినేట్ చేసిన ఐదారు గంటల తర్వాత వండుకోవచ్చు.
8. బొప్పాయి : ఈ పండ్లలో ప్రోటీన్ విచ్ఛిన్నం చేసే ఎంజైమ్లు ఎక్కువగా వుండటం వల్ల్.. వల్ల ఈ పండ్లలో ఏదైనా ఒకదానితో మాంసాన్ని నానబెట్టి కొన్నిగంటల తర్వాత వండుకోచ్చు.