మానవ శరీరానికి ఎన్నో ఆరోగ్యప్రయోజనాలను కలిగించే గుడ్లను ఎలా ఉడకబెడుతున్నారనే విషయాలపై చాలా జాగ్రత్తలు పాటించాల్సి వుంటుంది. ముందుగా తెలుసుకోవాల్సిందేమిటంటే.. గుడ్లు మెత్తగా వుండాలా..? లేక గట్టిగా వుండాలా..? అనేది చూసుకోవాలి. నిజానికి గుడ్లు సరిగ్గా ఉడకాయా..? లేదా..? అన్న విషయం తెలుసుకోవాలంటే.. ఉడికించిన అనంతరం ఆ గుడ్లను పగులగొట్టి చూసేదాకా తెలియదు. ఒకవేళ అది సరిగ్గా ఉడకపోతే.. పగులకొట్టిన అనంతరం వృధా అయిపోయింది. ఈ విషయంలోనే ప్రతిఒక్కరు పొరపాటు పడుతున్నారు. తొందరపాటులో గుడ్లు సరిగ్గా ఉడకాయా..? లేదా..? అన్నది తెలుసుకోకుండా కొన్ని సందర్భాల్లో తప్పు చేస్తుంటారు. అలాకాకుండా ఉడకబెట్టిన గుడ్లు సరిగ్గా ఉడకాయా.. లేదా..? అని తెలుసుకోవడానికి కొన్ని చిట్కాలు అందుబాటులో వున్నాయి. అవేమిటో చూద్దాం...
సాధారణంగా కొంతమంది మెత్తగా ఉడికిన గుడ్లను ఇష్టపడితే.. మరికొంతమంది గట్టిగా ఉడికిన గుడ్లను సేవించడానికి ఇష్టపడతారు. అంటే.. వ్యక్తిగత అభిరుచులను బట్టి వుంటాయి. కాబట్టి.. ఆ రెండు విధానాలకు సంబంధించి గుడ్డు ఎలా వుంటుందనే విషయాన్ని క్లుప్తంగా తెలుసుకుంటే మంచిది.
1. మెత్తగా ఉడకబెట్టిన గుడ్ల విషయంలో.. తెల్లసొన మెత్తగా వుండి కదులుతున్న పచ్చసొనను కావాలంటే తక్కువ సేపు ఉడకాలి. అలాగే కుదురుకున్న తెల్ల సొన, కొద్దిగా కుదురుకున్న పచ్చ సొన కావాలంటే ఎక్కువ సేపు ఉడకాలి. ఏదైనా ప్రత్యెక వంటకం కోసం బాయిల్డ్ ఎగ్ చేసేటప్పుడు గుడ్ల లోని పచ్చ సొన మధ్యలోనే ఉండాలనుకుంటే గుడ్లను ముందు నుంచే చల్లటి నీటిలో వేసి మెల్లిగా ఉడకనివ్వాలి. ఇలా జరుగుతుండగా ఒక చెక్క స్పూన్ తో దాన్ని పూర్తిగా ఉడికేదాకా మధ్యమధ్యలో కదపాలి. ఇలా కాకుండా తీవ్రమైన వేడి నీటి లో ఉడికిస్తే గుడ్లు రబ్బర్ లాగా సాగి, గట్టిగా మారిపోతాయి. తీవ్రంగా ఉడికిస్తే గుడ్లలోని మాంసకృత్తులు గట్టిగా అయిపోతాయి. వేడి మీద గుడ్లు గడ్డ కట్టుకు పోతాయి కనుక ఉడకబెట్టే అన్ని మంచి విధానాలు తక్కువ సెగ మీద మెల్లిగా వండడాన్నే సూచిస్తాయి.
2. క్కువ రోజులు ఫ్రిజ్ లో ఉంచిన గుడ్లకు ఎక్కువ పి.హెచ్ వుండి త్వరగా పగిలిపోతాయి, కానీ వాటి డొల్ల వొలిచి వేయడం తేలిక. పాకశాస్త్ర నిపుణురాలు రోజ్ ఎలియట్ గుడ్లను గుండ్రంగా వుండేవైపు ఉడకబెట్టే ముందు కొద్దిగా గుచ్చమని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల గాలి పోయి గుడ్డు పేలకుండా లేదా పగల కుండా వుంటుంది. ప్రత్యేకంగా తయారైన ఎగ్-ప్రికర్లు లేదా ఒక సూది కూడా ఇందుకోసం వాడవచ్చు. ఎక్కువ గుడ్లు ఒకే సారి ఉడకబెట్టడానికి ప్రత్యెక ఎగ్ హోల్డర్ కొనవచ్చు. గుడ్లు పగిలితే ఒక చుక్క వినేగార్ వేయండి, డొల్ల నుంచి కారడం ఆగిపోతుంది. పగిలిన గుడ్లను అల్యూమిమియం ఫాయిల్ లో వుంచి ఉడికించవచ్చు. వేడి గుడ్లను జాగ్రత్తగా బయటకు తీయండి. ఒక వెడల్పాటి స్పూన్ తో ఉడికే నీటి నుంచి తగిన సాధారణ జాగ్రత్తలతో గుడ్లను బయటకు తీయండి.