ప్రస్తుత రోజుల్లో చాలామంది మహిళలకు వంటగదికి సంబంధించిన అవగాహన అంతగా వుండదు. అంటే.. వంటగది ఎలా వుండాలి..? మంచి సువాసన కోసం ఏం చేయాలి..? వంటకు ఉపయోగించే సామాగ్రి ఏంటి..? అనే వ్యవహారాల గురించి అంతగా తెలిసి వుండదు. సాధారణంగా అన్ని విషయాలు ముందుగానే తెలిసి వుంటాయిగానీ.. కొన్ని విషయాల్లో మాత్రం వెనుకుండిపోతారు. అందులో ముఖ్యంగా స్పైసీ వస్తువులను ఎలా నిర్వవుంచాలో తెలియదు. మరి వాటిని ఎలా నిల్వవుంచాలి..? వాటివల్ల ఉపయోగం ఏంటి..? ఎలాంటి వంటకాల్లో ఉపయోగిస్తారు..? అన్న విషయంపై కొన్ని పద్ధతులు, చిట్కాలు తెలుసుకుందాం...
1. మిరియాలు (పెప్పర్) : సుగంధద్రవ్యాల్లో ఇది రారాజుగా పరిగణించబడుతుంది. ఆహార పదార్థాలపై దీన్ని వేసి తింటే.. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. వాడే ప్రతివంటకంలోనూ ఇది తప్పనిసరి. ఇవి ఘాటుగానే, కారంగానే వున్నా.. వంటకాలకు మాత్రం ప్రత్యేకమైన రుచిని అందిస్తాయి. కేవలం వంటకాలవరకు మాత్రమేకాదు.. ఆరోగ్యపరంగానూ ఎన్నో ఔషధగుణాలను కలిగి వుంటుంది. ఇందులోని ఘాటైన పిపరైన్, చావిసైన్ గుణాలు శరీరంలో పేరుకున్న కఫాన్ని కరిగించడానికి తోడ్పడుతాయి. జీర్ణక్రియ చురుగ్గా సాగేందుకు సహాయపడుతాయి.
2. కొత్తిమీర : ఇది ధనియాల మొక్క. అందులో వున్న గుణాలన్నీ ఇందులోనూ పుష్కలంగా వుంటాయి. సువాసన కోసమే దీన్ని వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా సూప్స్, కూరల్లో ఈ ఆకులను చేర్చుతారు. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇది ఒక ఔషధంగా కూడా పరిగణించబడుతుంది. శరీరాన్ని ఉత్తేజంగా వుంచడంలో దీని పాత్ర అమోఘం.
3. జీలకర్ర : తరుచుగా ఉపయోగించే ద్రవ్యాల్లో ఇదొకటి. దీన్ని మసాలా (పోపు) కోసమే ఎక్కువగా ఉపయోగిస్తారు. దీన్ని వంటకంలో చేర్చడంలో ఇది ఆ వంటకాన్ని ఎక్కువకాలం వరకు సువాసనతోబాటు రుచిని అందిస్తుంది. అంతేకాదు.. దీన్ని నిత్యం ఆహారంతో తీసుకుంటే.. మూత్ర సంబంధ వ్యాదులకు, నీరసము తగ్గుటకు, గర్భాశక బాధలు, పేగులు శుభ్రపరచుట, పైత్యం నివారించుటకు వాంతులు తగ్గుటకు, కడుపులో నులిపురుగుల నివారణకు బాగా ఉపయోగపడుతుంది.
4. పచ్చిమిర్చి : ఇది అత్యంత ఘాటు పదార్థం. ఇది లేనిదే వంటకానికి రుచి లేదు. ఏ విధంగా ఆహారంలో ఇది ముఖ్యమైందో.. అదేవిధంగా శరీరానికి ఎంతగానో తోడ్పడుతుంది. శారీరక బరువును తగ్గించడంలో, జీర్ణరసాన్ని క్రియాశీలంచేసి జీర్ణకోశాన్ని కాపాడటంలో, కాలేయ పనితీరు మరింతగా మెరుగుపర్చడంలో ఇది ఎంతగానో తోడ్పడుతుంది.
5. లవంగాలు : ఇది వంటకానికి రుచిని అందించడంతోబాటు గొంతుమంటను తగ్గించడంలో ప్రముఖపాత్ర పోషిస్తుంది. ఇందులో యాంటీస్పాస్ మోడిక్ గుణాలు పుష్కలంగా వుంటాయి. కండరాలు పట్టేసినప్పుడు ఈ తైలాన్ని రాస్తే.. త్వరగా ఉపశమనం పొందడంతోబాటు రక్తప్రసరణ బాగా జరుగుతుంది.
6. యాలకులు : వంటకాల్లో ఎంతో ముఖ్యమైన ఈ సుగంధద్రవ్యం.. నోటిదుర్వాసనను తొలగించడంలో ప్రముఖపాత్రను పోషిస్తుంది. అలాగే లేయ, జీర్ణసంబంధిత రుగ్మతలకు మంచి చికిత్స. దృఢమైన డిటాక్షిఫికేషన్ కారకంగా గుర్తింపు పొందింది.
ఇదేవిధంగా మిగతా సుగంధద్రవ్యాలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ప్రత్యేకతను కలిగి వుంటాయి.