ప్రతిఒక్కరు నోరూరించే వంటకాలను తినాలని ఇష్టపడతారు. అది ఏ వంటకం అన్నది ముఖ్యం కాదు.. తినడానికి రుచికరంగా వుందా, లేదా..? అన్నది ముఖ్యంగా భావిస్తారు. ఇక్కడితో బాగుంది కానీ.. వంటకం చేయడానికి రానివారిని మాత్రం అప్పుడప్పుడు కొన్ని సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. ఇంట్లో వంటకాలు చేయడానికి ఎవరూ లేకున్నప్పుడు పరిస్థితి ఏంటా..? అని ఆలోచిస్తూ కూర్చుండిపోతారు. అయితే అలా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వారికి అనువుగా నోరూరించే వంటకాలను చేయడానికి కొన్ని అనువైన చిట్కాలు అందుబాటులో వున్నాయి. అంతేకాదు.. కొన్ని వంటగది, అవసరమైన చిట్కాలు కూడా వున్నాయి. అవేమిటో తెలుసుకుందామా...
1. వంటగదిలో నిల్వవుంచిన నూనె ఎక్కువగా దుర్వాసన కొడుతుంటే.. అప్పుడు దానిలో 10 మిరియాలు వేస్తే చాలు.. కొన్నివారాల వరకు మళ్లీ చెడువాసన రాకుండా వుంటుంది.
2. పంచదార డబ్బాలకు అప్పుడప్పుడు చీమలు పడుతుంటాయి. అప్పుడు ఆ డబ్బాలో 3 లేదా 4 లవంగాలు వేస్తే చాలు.. ఆ దరిదాపుల్లో చీమలు రావు.
3. పప్పు దినుసులను డబ్బాలో వేసేముందు వేయిస్తే.. వాటికి బూజు, బురుగు పట్టకుండా వుంటుంది.
4. కొత్తిమీర కట్టలు ఫ్రిజ్’లో పెట్టేటప్పుడు వాటిని ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెడితే.. త్వరగా పాడవకుండా వుంటాయి.
5. బాండ్లీలో నూనె పొంగుతున్నప్పుడు దాంట్లో కాస్త ఉప్పు వేస్తే.. అది పొంగదు. అయితే తక్కువగా పొంగుతుంది.
6. పాలు త్వరగా తోడుకోవాలంటే అందులో కొద్దిగా జొన్నపిండితోబాటు విటమిన్-సి టాబ్లెట్ వేయండి. గడ్డ పెరుగు తోడుకుంటుంది.
7. కోసిన యాపిల్ పాడవకుండా వుండాలంటే.. దానిని ఉప్పు నీటిలో కడిగితే చాలు.. ఇక ఆ ఆపిల్ ముక్కలు ఎప్పటికి తాజాగా వుంటాయి.
8. చికెన్ లేదా మటన్ లివర్’ను పాలలో 15 నుండి 20 నిమిషాలు నానపెట్టి ఉడికిస్తే.. అది మెత్తగా వుండటమే కాక, మంచి రుచిని కూడా ఇస్తుంది.
9. ఆహారంలో గరిష్ట విలువ కోసం కొద్ది చుక్కలు చింతపండు రసాన్ని వేస్తే సరిపోతుంది.
10. పాలు అధికంగా మరిగి వాసన వస్తుంటే.. దానిలో కొద్దిగా ఉప్పు వేస్తే వాసన తగ్గుతుంది.
11. గుడ్లు ఉడికించే ముందు అవి పగలకుండా కొద్దిగా ఉప్పు మరియు కొద్ది చుక్కలు వినేగర్ వేయండి.
12. కేక్’ను కోసేటపుడు, కత్తిని చల్లని నీటిలో కొంత సమయం వుంచండి. ఈ చర్య కేక్ సమంగా కోసేలా చేస్తుంది.
13. ఉప్పును వర్షాకాలంలో గడ్డ కట్టకుండా వుంచటానికిగాను కొద్ది బియ్యాన్ని ఒక గుడ్డలో గట్టిగా కట్టి ఉప్పు డబ్బాలో వేయండి.
14. పచ్చళ్ళు ఎపుడూ బూజు పడుతూంటాయి. బూజు పట్టకుండా ఒక చిన్న గుడ్డలో ఆవాలు మూట కట్టి దానిని పచ్చడి జాడీలో శుభ్రమైన చెంచాతో పెట్టి వుంచండి. పచ్చడి జాడీనుండి ఎపుడు బయటకు తీసినా, దానిని పొడి గరిటె తో తీయండి, గాలి చొరకుండా మూత గట్టిగా పెట్టండి.
15. వెల్లుల్లి వలవకుండా వుండాలంటే, వాటి రెబ్బలు విడదీని వాటిని కొద్ది ఉప్పు, వినేగర్ తో కలిపి ఫ్రిజ్ లో వుంచండి. అవి చాలా రోజులు తాజాగా వుంటాయి.