- Step 1
ముందుగా ఎముకలు లేని చికెన్ ని తీసుకుని నీటితో శుభ్రం చేసుకుని, వాటిని ఒక పక్కన పెట్టుకోవాలి.
- Step 2
వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం, ఎండుమిర్చిని కలుపుకుని, మెత్తగా దంచి ఒక మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి.
- Step 3
ఈ మిశ్రమాన్ని చికెన్ కు బాగా పట్టించాలి. అలా మ్యారినేట్ చేసిన తరువాత ఒక రాత్రంతా చికెన్ ను ఫ్రిజ్ లో పెట్టేయాలి.
- Step 4
మరుసటి రోజు ఒక పెనుమును స్టౌ మీద వుంచి.. అందులో కొబ్బరి తురుము, ఉల్లిపాయ పేస్ట్ ను వేసి కొద్దిసేపు వరకు వేడి చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా వేడి చేసుకుని, తరువాత స్టౌ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- Step 5
ఇంకొక పెనుమును తీసుకుని, అందులో డీప్ బాటమ్ వరకు కొద్ది నూనె వేసి, స్టౌ మీద వుంచి వేడిచేసుకోవాలి. అలా కాగిన తరువాత అందులో బిర్యానీ ఆకు, యాలకులు, చెక్క, ఆవాలు, సోంపు వేసి కొద్దిసేపు వరకు మంటమీద వేడి చేసుకోవాలి. (పోపు మిశ్రమం).
- Step 6
ఇలా తయారు చేసుకున్న పోపు మిశ్రమంలో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ను అందులో వేయాలి. తరువాత 5 నుంచి 10 నిముషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి.
- Step 7
ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు కర్రీ నుంచి నూనె సెపరేట్ అవుతుంది. ఆ నూనెలో ఇంతకుముందు ఫ్రై చేసుకున్న కొబ్బరి, ఉల్లిపాయల పేస్ట్ ను కలుపాలి. అలగే వీటితోపాటు మసాలాలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి.
- Step 8
ఈ విధంగా ఈ మొత్తం మిశ్రమాన్ని ఫ్రై చేస్తూ.. అందులో ముక్కలు చేసిపెట్టుకున్న మామిడికాయలను వేసి మిక్స్ చేసుకోవాలి. అలాగే రెండు లేదా మూడు కప్పుల నీళ్లు, రుచికి సరిపడేంత ఉప్పును వేసి కొద్దిసేపు వరకు మంట మీద వేడిచేసుకోవాలి.
ఇలా ఈ విధంగా సమ్మర్ లో మ్యాంగ్ చికెన్ రిసిపీని తయారుచేసుకుని ప్రతిఒక్కరు అన్నంలో సర్వ్ చేసుకుని తింటారు.