- Step 1
ముందుగా గోంగూర ఆకులను శుభ్రంగా కడిగి, చిన్నముక్కలుగా కట్ చేసుకొవాలి.
- Step 2
ఆలుగడ్డలను కడిగి పొట్టు తీసిన ముక్కలు నీళ్లలో వేసి పక్కన ఉంచాలి.
- Step 3
పరిశుభ్రమైన పాత్ర తీసుకొని, స్టౌవ్ మీద ఉంచి తగినంత నూనె తీసుకొని వేడిచేసి అందులో మెంతులు, జీలకర్ర వేసి వేగాక, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేగాక కారం, పసుపు, ఉప్పు వేసి ఒక్కసారి కలిపి బంగాళాదుంప ముక్కలు వేసి కొద్దిగా నీళ్ళు పోసి చిన్న మంటమీద పదినిముషాలు మూతపెట్టి ఉడకనివ్వాలి.
- Step 4
పదినిమిషాలు ఉంచిన తరువాత మూతతీసి కట్ చేసిన గోంగూర అకులను అందులో వేసి కలిపి, రెండు నిమిషాల పాటు మూత వుంచి, మరొ రెండు నిమిషాలు ఆగి స్టౌవ్ ఆపాలి.
- Step 5
అంతే పుల్లపుల్లని గోంగూర బంగాళాదుంపల కూర రెడి.