- Step 1
తజా అరటి పండ్లు తీసుకొని ముందుగా శభ్రపరచి తొక్కతియాలి. తర్వాత ఒక్కొక్క అరటిపండును చేతీతో మెత్తగా చేసుకోవాలి. కొబ్బెరను చిన్నముక్కలుగా చేసుకొని తురుము పట్టుకొవాలి.
- Step 2
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులొ అరటి పండు ముద్దలు, బొంబాయి రవ్వ, కొబ్బరి తురుము, పంచదార, సోడా పోడి, నెయ్యి ల మిశ్రమాన్ని అంతటిని ఒక బౌల్ లోకి తీసుకొని నీళ్లు కలుపుకొవాలి.
- Step 3
ఇడ్లీ పిండిలాగా ఈ మిశ్రమాన్ని అంతటిని కలుపుకొవాలి.
- Step 4
ఇప్పుడు స్టౌవ్ వెలిగించుకొని ఇడ్లి పాత్రను స్టౌ మిద ఉంచి అందులో కొన్ని నీళ్లు వేసి వేడి చేస్తూ, ఇడ్లీ రెకులలొ ఇడ్లి పిండి వేసి, ఇడ్లి పాత్రలో ఉంచి మూత పెట్టాలి.
- Step 4
పావు గంట సెపు ఉడికిన తర్వాత స్టౌ మీద నుండి క్రిందకు దింపాలి. ఇప్పుడు చిన్నగా మూత తీసిన తర్వాత, ఇడ్లి రెకులను బయటకు తీసి ఒక్కోక్కటిగా ఇడ్లిలను తియాలి. కొబ్బరి చట్నిలో తింటుంటె చాలా రుచికరంగా ఉంటాయి. ఈ అరటిపండు ఇడ్లిలను బ్రేక్ ఫాస్ట్ గా లేదా స్నాక్స్ ఐటమ్ గా కూడా తినవచ్చూ.