- Step 1
బాస్మతి రైస్ అర గంట సెపు నానబెట్టుకొవాలి. మీల్ మేకర్ ను కూడా వెడినీటిలొ పావుగంట నానబెట్టుకొవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బీన్స్, క్యారెట్, ఆలు చిన్న చిన్న ముక్కలుగా తురుముకొని పక్కన పెట్టుకొవాలి.
- Step 2
ఇప్పుడు పరిశుభ్రమైన పాత్ర తీసుకొని అందులొ నెయ్యి వెసి వేడి చేస్తూ జిడిపప్పు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలుకలు వేగాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం తరుగు, పుదీనా, కూరగాయల మిశ్రమాన్ని అందులో వేసి బాగా వేగించాలి.
- Step 3
అలా వేగిస్తూనె ముందుగా నాన బెట్టిన మీల్ మేకర్ ను వేసి బాగా కలిపి రెండు నిమిషాల తర్వాత కొబ్బరి పాలు, నీళ్లు కూడా వేసి బాగా మరిగించాలి.
- Step 4
ఇప్పుడు బాగా మరుగుతున్న నీటిలొ నాన బేట్టిన బాస్మతి రైస్, ఉప్పు వేయ్యాలి. ఇప్పుడు మూత ఉంచి సన్నని మంటపై 20 నిమిషాల పాటు మగ్గించాలి.అంతె మీల్ మేకర్ వెజిటబుల్ బిర్యాని రెడి.