- Step 1
సేమియాలను ఒక పాత్రలోకి తీసుకొని నాలుగు గ్లాసుల నీళ్లు, నిమ్మరసం, నూనె వేసి ఐదు నిమిషాల పాటు స్టౌ మీద ఉంచి ఉడికించాలి. ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత తడి బట్ట తీసుకొని ఉడికిన సేమియాలను వడగట్టాలి. (నీరు అంత పోయేంతవరకు) లవంగాలు, దాల్చిన చెక్క, యాలుకులు, పసుపు, పచ్చి మిర్చి, ఉల్లిపాయ ముక్కలను కలిపి మిక్సీలో వేసి ముద్ద చేసి పెట్టుకోవాలి.
- Step 2
ఇప్పుడు ఇంకో పాత్ర తీసుకొని స్టౌ మీద ఉంచి అందులో కొంచం నూనె వేసి, శుభ్రంగా కడిగి ఉంచుకున్న చికెన్ ముక్కలను అందులో వేసి చిన్న మంటపై ఐదు నిమిషాలు ఉడికించాలి.
- Step 3
ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత దాల్చిన చెక్క, యాలుకలు, పసుపు, పచ్చి మిర్చి ల మిశ్రమాన్ని చికెన్ పై చల్లి అల్లంవెల్లుల్లి ముద్ద కూడా అందులో వేసి బాగా కలపాలి.
- Step 4
మరో ఐదునిమిషాల పాటు ఉడికించి, ఆపైన సేమియా కూడా వేసి మళ్ళీ బాగా కలపాలి.ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు, కొత్తిమీర ఆకులు, బిర్యానీ ఆకు, జీడిపప్పు వేసి బాగా కలిపి స్టౌ మీద నుండి క్రిందకు దింపాలి. అంతే- సేమియా చికెన్ బిర్యానీ రెడీ.