- Step 1
ముందుగా కొర్రలను శుభ్రముగా కడిగి, ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో మూడు కప్పుల నీళ్లు తీసుకొని, శుభ్రపరిచిన కొర్రలను అందులో వేసి స్టౌ వేలిగించుకొని మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.
- Step 2
ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటలను చిన్నచిన్నముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. పూదీనా అకులను పేస్టు చేసి పెట్టుకోవాలి.
- Step 3
ఇప్పుడు ఒక పాత్ర తీసుకోని అందులొ నూనె వేసి జీడిపప్పు, జీలకర్ర చిన్నచిన్నముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చిలను వేసి కొద్దిసేపు వేగించాలి. అవి గోధుమరంగులోకి వచ్చాక పసుపు, టమోటా ముక్కలు పూదీనా మిశ్రమాన్నివేసి ఐదునిమిషాల పాటు వేగనివ్వాలి.
- Step 4
ఉడికిన కొర్రలను నీళ్లు అన్ని వడకట్టి (తడి లెకుండా) ఒక ప్లేట్‌లో పోసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఉడికిన కొర్రలు, తగినంత ఉప్పు వేసి కొద్దిసేపు వేగించి స్టౌ మీద నుండి క్రిందకు దించాలి. పుదీనా కొర్రల రైస్ రెడీ.
- Step 5
పుదీనా కొర్రల రైస్‌ను పెసర పప్పుతో తింటె చాలా రుచికరముగా ఉంటుంది.