- Step 1
ముందుగా బియ్యం, మినప్పప్పు, అటుకులు, మెంతులు కలిపి రుబ్బుకున్న మిశ్రమాన్ని ఇడ్లీ పిండిలాగా చేసుకొవాలి.
- Step 2
తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, మిరియాలను పొడి చేసుకొవాలి.
- Step 3
ఇప్పుడు ఒక గిన్నె తిసుకోని అందులో ఇడ్లీ పిండి, గుడ్లు పగలగొట్టి అందులో వేయాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, మిరియాల పొడిల మిశ్రమాన్ని వేసి బాగ కలపాలి.
- Step 4
ఇప్పుడు ఒక పెనుము తీసుకోని స్టౌ మీద ఉంచి వేడి చేస్తూ పెనుము గుంతలలో నూనె చిలకరించి, పిండిని నింపి మూత పెట్టాలి. ఇలా ఐదునిమిషాల తర్వాత మూత తీసి పొంగనాలను ఇరువైపులా కాల్చుకోవాలి. బాగా కాగిన తర్వాత ఒకొక్కటిగా ప్లెట్ లోకి తిసుకోవాలి.
- Step 5
ఎగ్ పొంగనాలకు అల్లం చట్నీ మంచి కాంబినేషన్.