- Step 1
బాస్మతి బియ్యం శుభ్రంగా కడిగి, పొడిగా ఉడికించిన అన్నం పక్కన పెట్టుకోవాలి. ముందుగా తాజా దొండకాయలను తీసుకొని నిలువునా కట్ చేసుకొని, ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని అందులో నూనె, నెయ్యి వేసి నిలువునా తరిగిన దొండకాయలను 15నిమిషాల పాటు వేగిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసేయాలి..
- Step 3
అదే పాత్రలోనే అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిముక్కలు దోరగా వేగిన తర్వాత కొబ్బరి పేస్టు కలపాలి. రెండు నిమిషాల తర్వాత ధనియాల పొడి, జీరా, పసుపు,ఉప్పు, కారం కలపాలి.
- Step 4
ఇప్పుడు దొండకాయ ముక్కలను వేసి పదినిమిషాలు వేగిన తర్వాత అన్నం, నిమ్మరసం కలిపి స్టౌ మీద నుండి దింపాలి. అంతే దొండకాయ బిర్యాని రెడీ..