- Step 1
ముందుగా రొయ్యలను శుభ్రంగా కడిగి, ఒకపాత్ర తీసుకొని స్టౌ మీద ఉంచి రొయ్యలను అందు లో వేసి కారం, ఉప్పు, ధనియాలపొడి, జీర పొడి, పసుపు వేసి బాగా కలపాలి.
- Step 2
తర్వాత ఒక పెనం తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి రొయ్యల మిశ్రమాన్ని వేసి నీరంతా ఆవిరయ్యేవరకు చిన్న మంటపై వేగించి పక్కన పెట్టుకోవాలి.
- Step 3
ఇప్పుడు ఆ పాత్రలోనె మరికొంత నూనె వేసి ఉల్లి, పచ్చిమిర్చితరుగు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఒకదాని తర్వాత ఒకటి వేగించాలి. ఇప్పుడు (తొక్కతీసిన) బీర ముక్కలు, ఉప్పు కలిపి మగ్గించాలి.
- Step 4
బీర ముక్కలు సగం ఉడికిన తర్వాత రొయ్యలతో పాటు పావుకప్పు నీరు పోసి ఉడికించాలి. కూర చిక్కబడ్డాక కొత్తిమీర చల్లి దించేయాలి వేడివేడి అన్నంలో తింటే ఎంతో రుచిగా ఉంటుంది.