- Step 1
ముందుగా మటన్ ను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత మటన్ తీసుకొని కొద్దిగా పెరుగు, ఉప్పు, కారం, పసుపు, మరియు ఒక చెంచా ఆవాలు వేసి బాగా కలుపుకొని 2 గంటల పాటు ననా బెట్టి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
ఇప్పుడు ఉల్లిపాయ, టమోటాలను పేస్ట్ చేసి పెట్టుకొవాలి. తర్వాత ఒక పాత్ర తీసుకొని అందులో నూనె వేసి దాల్చిన చెక్క, యాలకులపొడి, బిర్యానీ అకు, లవంగాల పొడి వేసి ఒక నిమిషంపాటు వేగనివ్వాలి.
- Step 3
ఇప్పుడు అందులోనే ఉల్లిపాయ, టమాటా పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేగించాలి. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర మరియు ధనియాలపొడి వేసి 5 నిముషాలు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి.
- Step 4
ఇప్పుడు ఐదు నిమిషాల వరకు అలా కలుపుతు ఉండాలి. ఇప్పుడు మంటను పూర్తిగా తగ్గించి తర్వాత పాన్ కు మూత పెట్టిన తర్వాత మద్యమద్యలో కలియబెడుతుండాలి.
- Step 4
మటన్ మెత్తగా ఉడికిన తర్వాత అందులో గరం మసాలా పౌడర్ వేసి బాగా కలిపి దించేసమయంలో కొత్తిమీర తరుగును చల్లాలి. అంతె మటన్ కర్రీ రెడీ. ఈ మటన్ కర్రీని బిర్యాని అన్నం లో తీంటే చాలా రుచికరముగా ఉంటుంది.