వేసవిలో చాలా వరకు అన్ని రకాల పండ్లు దొరుకుతాయి. ముఖ్యంగా శరీరాన్ని కూల్ గా ఉంచే పండ్లు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. ఉదా పుచ్చకాయ, దోసకాయ, కీరకాయ వంటవి శరీరానికి తగినంత చల్లదాన్ని అంధిస్తాయి. వేసవిలో అధిక వేడి, ఎండల వల్ల మన శరీరంను కాపాడుకోవడానికి ఇటువంటి పండ్లను తప్పని సరిగా వాడాలి. అప్పుడే వడదెబ్బ నుండి మన శరీరాన్ని చర్మాన్ని రక్షించుకోగలుగుతాము. ఎండాకాలంలో చల్లచల్లని సలాడ్ లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రుచికి కూడా చాలా బాగుంటుంది. పండ్లు తినని పిల్లలకు సలాడ్ ల రూపంలో చేసి పెట్టండి. తియ్య తియ్యగా తినడానికి ఇష్టపడతారు. సలాడ్ లలో పోషక విలువలు కూడా అధికం. వేసవి తాపానికి భోజనం చేయాలన్నా, చపాతీలు తిన్నాలన్నా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. ముందుగా తయారు చేసి ఫ్రిజ్లో పెట్టుకున్న ఈ సలాడ్ లను బయటికి వెళ్లి వచ్చిన తరువాత చల్లగా తింటుంటే ఆ మజానే వేరు.. మరి ఈ సలాడ్ లను ఎలా తయారు చేయ్యాలో రెసిపిలో చూద్దామా