- Step 1
బియ్యం కడిగి నానబెట్టాలి. తాజా టమాటాలను శుభ్రంగా కడిగి పక్కన పట్టుకొవాలి. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ట తీసుకొని శుభ్రంగా కడిగి చిన్నచిన్నముక్కలుగా కట్ చేసుకొవాలి.
- Step 2
ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని అందులో టమాటాలు కొన్నినీళ్లు వేసి ఉడికించాలి. ఇప్పుడు టమాటాలు మెత్తబడ్డాక మిక్సిలో వేసి కొద్దిగా అవసరం అయితే కొన్ని నీళ్లు కలిపి టమాటా రసం నాలుగు గ్లాసులు వచ్చేలా తియ్యాలి.
- Step 3
స్టవ్ వెలిగించి, ఒక పాత్రలో నెయ్యి వేసి కాగిన తరువాత యాలకులు, లవంగాలు, కరివేపాకు వేసి వేగాక, ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేపాలి.
- Step 4
ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు, గరం మసాల, కొత్తిమీర వేసి కాసేపు వేగనిచ్చి బియ్యం వేసి అర నిముషం వేపాలి.
- Step 5
తరువాత టమాటా రసం వేసి ఒకసారి కలిపి, మూతపెట్టి పది నిముషాలు పెద్ద మంటమీద ఉడికించి, తరువాత పది నిముషాలు చిన్న మంట మీద ఉడికించాలి.
- Step 6
ఇప్పుడు స్టవ్ ఆపి కొత్తిమీర చల్లి వేడివేడిగా వున్నప్పుడు వడ్డించాలి. అంతే ఘుమఘుమలాడే టమాట రైస్ రెడి.