- Step 1
బియ్యం కడిగి ఒక అరగంట నానబెట్టుకోవాలి. ఉల్లిగడ్డలు, టమటాలను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకొవాలి. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- Step 2
ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని అందులో పెరుగులో అల్లంవెల్లుల్లి పేస్ట్, ఒక టీస్పూన్ గరంమసాల పొడి, పుదీనా మిశ్రమం వేసి, కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలిపి చికెన్ వేసి కలిపి ఒక అరగంట సేపు నానబెట్టుకొవాలి.
- Step 3
ఇప్పుడు ఒక పెన్నం తీసుకొని అందులో నూనె వేడిచేస్తూ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిముక్కలను, మసాలాదినుసులు వేసి దోరగా వేగనివ్వాలి. ఇప్పుడు తరిగిన టమాటాముక్కలు వేసి ఇవి ఉడికిన తరువాత చికెన్ మిశ్రమం వేసి కలపాలి.
- Step 4
చికెన్ కొద్దిగా ఉడికిన తరువాత ఒక స్పూన్ మసాలాపొడి వేసి కలిపి తగినన్ని నీళ్ళు, ఉప్పు వేయాలి. నీరు మరుగుతుండగా నానబెట్టిన బియ్యం వేసి కలిపి మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి. అంతే చికెన్ పలావ్ రెడీ. ఈ చికెన్ పలావ్ పెరుగు చట్నితో తింటే చాలా రుచికరముగా ఉంటుంది..