సాధారణంగా వర్షాకాలమో, శీతాకాలమో వచ్చిందంటే చాలు ఇంట్లో నుండి అడుగు బయటపెట్టడానికి కూడా ఇష్టం ఉండదు చాలా మందికి. ఎముకలు కొరికే చల్లగాలిలో బద్దకం. వంటగదిలోకి వెళ్ళడానికి మనసు మారాం చేస్తుంది. చలిగాలికి, వర్షానికి గొంతులోకి కాస్త వేడి వేడిగా టీనో, కాఫీనో... కానీ ఎప్పుడూ అవేనా? హాట్ హాట్ సూప్ లు ఉన్నాయి కదా.. ఒక పట్టు పట్టవచ్చు కదా.... వింటర్ సీజన్ ఎంజాయ్ చేయాలంటే వేడి వేడి సూప్ త్రాగండి.. కూరగాయలతోనే కాకుండా మాంసాహారంతో తయారు చేసే సూప్ లు కూడా చాలా రుచిగా ఉంటాయి. చికెన్ స్వీట్ కార్న్ సూప్ ఆరోగ్యంతో పాటు రుచి మరింత అద్భుతంగా ఉంటుంది. మరీ ఈ సూప్ తయారు చేయడం కూడా సులభమే. అనారోగ్య కారణంతో నోటికి రుచి తెలియనప్పుడు ఇటువంటి సూప్ లను తయారు చేసుకొని తాగవచ్చు. ఎలా తయారు చేయ్యాలో మనము ఈ రెసిపిలో చూద్దామా.