- Step 1
తాజా కాకరకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పునీటిలో రెండు నిమిషాలు నానపెట్టి ఉంచాలి. తర్వాత ఒక పాత్ర తీసుకని అందులో మైదా, కార్న్ ఫ్లోర్, నిమ్మరసం వేసి బాగా కలిపి పావుగంట సేపు నానపెట్టి అలా ఉంచాలి. తర్వాత ఉల్లిపాయ,టమటాలను తీసుకొని చిన్నచిన్నముక్కలుగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి.
- Step 2
ఇప్పుడు ఒక పెన్నం తీసుకొని అందులో కొద్దిగా నూనె పోసి వేడియ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న కాకర మిశ్రమాన్ని అందులో వేసి దోరగా వేగించుకొవాలి.
- Step 3
ఇప్పడు ఒక పాత్ర తీసుకొని అందులో తగినంత నూనె పోసి వేడిచేస్తూ పోపు గింజలు, ఉల్లిపాయ తరుము, అల్లం వెల్లుల్లి పేస్టూ, టమటా తురుము, సోయాసాస్, టమటా సాస్, ఉప్పు, కారం వేసి ఐదు నిమిషాలపాటు దోరగా వెగించాలి.
- Step 4
తర్వాత ముందుగా వెగించి పెట్టుకున్న కాకరను వేసి బాగా కలిపి ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి. అంతే మనముందు వెరైటి కాకరకాయ మంజూరియన్ రెడీ.
- Step 4
కాకరకాయ మంచూరియన్ ను వేడివేడి అన్నంలో తింటే చాలారుచికరముగా ఉంటుంది..