- Step 1
ముందుగా ములక్కాడలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు కట్ చేసుకొని పక్కట పెట్టుకోవాలి. గుడ్లు కూడా ఉడికించి పెట్టుకోవాలి.
- Step 2
కడాయిలో నూనె వేసి వేడిచేయాలి నూనె వేడి అయిన తరువాత గుడ్లను వేయించి తీయాలి (గుడ్లకు అక్కడక్కడ గాట్లు పెట్టుకోవాలి)
- Step 3
అదే నునెలో ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.
- Step 4
ఇప్పుడు టమాట ముక్కలు వేసి మగ్గినివ్వాలి ఇందులో ములక్కాడలు వేసి కలిపి 1 నిమిషాం పాటు మూతపెట్టాలి.
- Step 5
తరువాత మూత తీసి కారం, పసుపు, వేసి కొద్దిగా నీళ్లు పోసి 5 నిమిషాలపాటు ఉకబెట్టి చింతపండు రసం, గుడ్లు వేసి మరో 5 నిమిషాలు ఉడకనివ్వాలి చివరగా మసాల, కొత్తిమీర వేసి కలిపి దించేయాలి. రుచికరమైన గుడ్లు ములక్కాడ కూర రెడీ.