రోజంతా మనం చురుగ్గా పని చేయాలంటే, మనం ఉదయం ఎటువంటి ఆహారం తీసుకుంటున్నామో ఒక సారి
గమనించాలి, ఉదయాన్నే నూనె, మసాల లేని ఆహారం తీసుకుంటే ఆ రోజంతా మన దినచర్య బాగుంటుంది.
ముడి పెసళ్ళ మొలకులు మొదటి ఆహారంగా తీసుకుంటే జీర్ణ వ్యవస్త సవ్యంగా పనిచేస్తుంది.
ఇది గుండేకు చాలా మంచిది. హార్ట్ పేషేంట్ కి ఇది ఎంతో మేలు చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు రోజూ
క్రమం తప్పకుండ ఈ మొలకలు తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు ఫిట్ గా కూడా ఉంటారు. 5
సంవత్సరాల పిల్లల దగ్గరనుంచి దీనిని అందరూ తినవచ్చు. ఎంతో ఆరోగ్యమైన ముడిపెసళ్ళ మొలకలు ఎలా
తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం.