దీనినే చాలా మంది సుజీ ఇడ్లీ అని, సెమోలీనా ఇడ్లీ అని కూడా అంటారు.మనము ఎప్పుడు చేసే ఇడ్లీకి పిండిని ముందురోజే తయారుచేసుకుని ఉంచుకోవాలి.ఈ ఇడ్లికీ ఆ అవసరం ఉండదు.పైగా మాములు ఇడ్లీల కన్నా చాలా మెత్తగాను రుచిగాను ఉంటాయి.ఇడ్లీ అంటే ఇష్టం ఉండని వారు కూడా దీనిని ఇష్టపడతారు.
తయారు చేయు విధానం
ముందుగ పాన్‌లో కొంచం నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. అందులో ఆవాలు, పచ్చి శెనగపప్పు వేసి వేయించాలి. అది కాస్త వేగాక ఉప్మా రవ్వ కూడా వేసి మరికాసేపు వేయించాలి. వేగిన ఉప్మా రవ్వను ఒక బౌల్‌లోకి తీసుకొని అందులో పెరుగు, ఉప్పు, తగినంత నీళ్ళు పోసి కలపాలి. మామూలుగా తయారు చేసే ఇడ్లీ పిండి లాగే తయారు చేసుకోవాలి. అందులో క్యారట్ ముక్కలు, ఉల్లిపాయలు, అల్లం వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అర్ధ గంట పాటు నాన పెట్టాలి. వీటిని ఇడ్లి పాతర్లో పెట్టి మామూలు ఇడ్లి చేసే విధానములోనే ఉడికించాలి. అంతే ఎంతో రుచి గా ఉండే రవ్వ ఇడ్లి రెడీ. దీనిని వేరుశెనగ పచ్చడితో తింటే చాలా బావుంటుంది.