తయారు చేయు విధానం
ఒక ప్యాన్ లో నూనె పోసి ఆవాలు, కరివేపాకు ఆకులు, మెంతులు వేసి తాలింపు వేయాలి. ఆ తరువాత తరిగిన పచ్చి మిరపకాయలు, ఉల్లిపాయలు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. ఇక తరిగిన బెండకాయలు, తగినంత ఉప్పు వేసి ఒక 15 నిమిషాలపాటు వేయించాలి. ఇందులో కారం పొడి, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. కాస్త ఆగిన తరువాత తరిగిన టమాటాలు వేసి మరో 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. తరువాత చింతపండు రసంతో పాటు 3 కప్పుల నీళ్ళు పోసి మూత పెట్టేయాలి. ఆలాగే సన్నని మంట పైన మరో పది నిమషాలు మరగనివ్వాలి. అంతే నోరూరించే బెండకాయ పులుసు రెడీ.