కాకర కాయ పేరంటే చాలూ చాలా మందికి డోకు వచ్చేస్తుంది. అందుకు కారణం చేదంటే చాలా మందికి ఇష్టం ఉండకపోవటం. కానీ, సరిగ్గా వండితే చేదు లేకుండానే కాకరకాయ రుచిని ఆస్వాదించవచ్చు. కాయలో కారం పెట్టి నూనెలో వేగిస్తే కాయపళంగా లాగించేస్తారు. ఆరోగ్యం కావాలంటే వంటల్లో ఆ కాయ ఉండాల్సిందే. ఆ కాయే.. కాకరకాయ. కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ కాకరకాయ చేదులో ఎన్నో తీయని గుణాలు ఉన్నాయి. ఇది షుగర్ వ్యాది ఉన్నవారికి చాలా మంచి ఆహారం. శనగపిండితో చేసుకునే ఈ వేపుడు సైడ్ డిష్ కి బాగా పనికొస్తుంది. మరి ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం...