తయారు చేయు విధానం
ముందుగా పచ్చిఅరటికాయ పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయను కూడా కట్ చేసి పెట్టుకోవాలి. అరటికాయ ముక్కలలో కొద్దిగా నీళ్ళు పోసి ఉప్పు వేసి 5 నిమిషాల పాటు ఉడికించి దానిని పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత స్టవ్ మీద ప్యాన్‌లో నూనె పోసి కొద్దిసేపు కాగనివ్వాలి. నూనె కాస్త కాగాక పోపు గింజలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. దాంట్లో అరటికాయ ముక్కలు వేసి మూత పెట్టి ఐదు నిముషాలు వేయించాలి. ఇప్పుడు అందులో పసుపు, కారం, మిరియాల పొడి వేసి కలిపి దించాలి. అంతే రుచికరమైన పచ్చిఅరటికాయ ఫ్రై రెడీ.