తయారు చేయు విధానం
ఒక పెద్ద ప్యాన్ తీసుకూవాలి. తగినంత నూనె పోసుకొని కాగాక యాలకులు, ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు వేయించుకోవాలి. పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు పాలు, నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని 5 నిముషాలు ఉడక పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గుడ్డు తీసుకొని పగలకొట్టి గుడ్డు మొత్తం ఒకే చోటు పడేటట్టు వేసుకోవాలి. అలాగే మిగిలిన గుడ్లను ప్యాన్ అన్ని వైపుల వేసుకొని మూత పెట్టుకొని 10 నిముషాలు ఉడక పెట్టుకోవాలి. ఉడికాక గుడ్లను తిప్పుకొని నీళ్ళు పోయేంత వరకు ఉడక పెట్టుకోవాలి. ఆ తరువాత కొత్తిమీర చల్లి దించేయాలి. ఎంతో ఆరోగ్యకరమయిన పుష్టి కరమయిన పాలతో ఎగ్ కర్రీ రెడీ.