- Step 1
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం పేస్ట్, ఉప్పు, కారం, జీలకర్ర, అన్ని రకాల మసాలా పొడులు వేసి కనీసం ఒక గంట సేపు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి.
- Step 2
తర్వాత బియ్యం శుభ్రంగా కడిగి కొద్దిగా ఉప్పువేసి సంగం ఉడికేవరకూ ఉడికించి పెట్టుకోవాలి.
- Step 3
ఇప్పుడు బంగాళదుంపల యొక్క పొట్టు తొలగించి ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగి ఫ్రైయింగ్ పాల్ లో వేసి ఫ్రై చేసి పెట్టుకోవాలి.
- Step 4
తర్వాత ఒక బౌల్ లో రెండు టేబుల్ స్పూన్ల నీళ్ళు పోసి అందులో ఎల్లో ఫుడ్ కలర్ వేయాలి.
- Step 5
ఇప్పుడు ఒక మందపాటి పాత్రలో ముందుగా సగం ఉడికించి పెట్టుకొన్న అన్నంవేసి పాత్రమొత్తం సర్ధాలి. తర్వాత దానికి మీద ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ వేసి సర్దాలి, తర్వాత బంగాళదుంపలు, అరకప్పు వేగించుకొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర మరియు పచ్చిమిర్చి తరుగు వేసి సమంగా సర్దుకోవాలి. ఇలా రెండు మూడు లేయర్స్ గా మొత్తం సర్దుకోవాలి.
- Step 5
తర్వాత పైన ఎల్లో ఫుడ్ కలర్ మిక్సర్ ను వేసి మూత పెట్టి, చాలా తక్కువ మంట మీద 15నిముషాలు ఆవిరి మీద మాత్రమే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల సగం ఉడికిన అన్నం, పూర్తిగా ఉడుకుతుంది, మరియు చికెన్, బంగాళదుంపలు కూడా మెత్తగా ఉడుకుతాయి.
- Step 5
మొత్తం ఉడికించుకొన్న తర్వాత మూత తీసి అందులో కెవ్రా ఎసెన్స్ ను చిలకరించి, మూత పెట్టి మరో రెండు నిముషాలు ఉడికించుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి క్రిందికి దింపుకోవాలి. అంతే బాంబే బిర్యానీ రిసిపి రెడీ. ఇంకేం నిమ్మకాయ్, ఉల్లిపాయ సలాడ్ తో కానిచ్చేయండి.