దేశం మొత్తం దీపావళి వేడుకలకు సిద్ధమైపోతుంది. దీపాల వెలుగులతో, టపాసుల చప్పుళ్లు-వెలుగుళ్లతో సంబరాలు ఇప్పటికే మొదలయిపోయాయి. అదే సమయంలో ఈ పండగ అంటేనే ప్రతి ఒక్కరికి నోరూరించే మిఠాయిలు గుర్తుకు వస్తాయి. అయితే స్నేహితులు, బంధువులు, తెలిసిన వారు, ఆఫీసుల్లో ఇలా బయటి నుంచి స్వీట్లు ఎన్ని వచ్చినప్పటికీ, ఇంట్లో చేసుకునే వాటి ప్రత్యేకత వేరేగా ఉంటుంది. కాస్త ఖరీదు అయినప్పటికీ దీపావళి ప్రత్యేకంగా వాటిని అంతా తయారు చేసుకుంటారు. డ్రై ఫ్రూట్స్ తో బర్ఫీ ఎలా చేయాలో మరి ఇప్పుడు తెలుసుకుందాం.
తయారు చేయు విధానం
ముందుగా ముల్లంగి, క్యారట్ చెక్కు తీసి తురుముకోవాలి. బాణలిలో ఒక స్పూన్ నూనె వేసి ఆ తురుమును ఉప్పు పసుపుతో కలిపి ఒక 5 నిమిషాల పాటు వేయించాలి. దీని వలన పచ్చి ముల్లంగిలోని ఘాటు పోతుంది. రెండు తురుములు కూడా ఉడుకుతాయి. ఇది పక్కకు పెట్టుకోవాలి. బాణలిలో కొంచెం నూనె వేసి, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి పోపు చేసుకోవాలి. దానిలో కరివేపాకు, తరిగిన పచ్చి మిరపకాయలు, అల్లం తురుము వేసి ఒక నిమిషం వేయించాలి. ఆ పోపులో ముందుగా వేయించుకున్న ముల్లంగి-క్యారట్ తురుమును వేసి ఒక రెండు నిమిషాలు స్టవ్ పైనే ఉంచాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత పెరుగులో కలపాలి. అన్నీ కలిపిన తరువాత ఉప్పు చూసుకుని అవసరమైతే కాస్త వేసుకోవాలి. చివరగా తరిగిన కొత్తి మీర, దానిమ్మ గింజలతో ఈ పెరుగు పచ్చడిని అలంకరించుకోవచ్చు. ముల్లంగి జీర్ణవ్యవస్థకు, రక్తశుద్ధికి ఎంతో ఉపయోగకరమైన కూరగాయ. వారానికి ఒక్కసారైనా తింటే మంచిది అని డాక్టర్లు చెబుతారు. ఈ పెరుగు పచ్చడి అన్నంలోకే కాదు, పుల్కాలు/చపాతీలతో కూడా రుచిగా ఉంటుంది.