- Step 1
ఒక పాన్ తీసుకొని అందులో నీళ్ళు, పాలు, పంచదార, ఆపిల్ తురుము వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి.
- Step 2
ఇప్పుడు ఈ పాన్ ను స్టౌ మీద పెట్టి, మీడియం మంట మీద కొన్ని నిముషాలు ఉడికించాలి. మొత్తగా పేస్ట్ అయ్యే వరకూ ఉడికించుకోవాలి.
- Step 3
మొత్తం మిశ్రమం చిక్కబడే సమయంలో అందులో డ్రైఫ్రూట్స్ (రఫ్ గా పొడి చేసుకొని లేదా అలాగే )వేసుకొని, బాగా మిక్స్ చేయాలి. చివరగా కొద్దిగా నెయ్యి వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపు కోవాలి.
- Step 4
ఆ తర్వాత కొబ్బరి తురుము, యాలకలపొడి వేసి మరో సారి మిక్స్ చేయాలి . అలాగే కొద్దిగా నెయ్యి మిక్స్ చేసి తర్వాత మరికొన్ని నిముషాలు ఉడకించుకోవాలి. చివరగా కొద్దిగా ఫుడ్ కలర్ అవసరం అనిపిస్తే జోడించుకోవచ్చు . అంతే ఆపిల్ హల్వా రెడీ. ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసి, చెర్రీస్ తో గార్నిష్ చేసి వేడి గా లేదా చల్లగా సర్వ్ చేయాలి. అంతే యాపిల్ హల్వా రెడీ.