- Step 1
కందిపప్పు కడిగి నీళ్లు పోసి సగం పసుపు కొంచెం నూనె వేసి ఉడికించాలి. చేమగడ్డలు పొట్టు తీసి ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
- Step 2
బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక, సన్నగా తరిగిన ఉల్లిపాయ, కరివేపాకు వేసి మెత్తబడేవరకు ఉంచాలి.
- Step 3
ఆపై పసుపు, మిరప్పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి నిమిషం సేపు వేయించి చేమగడ్డలు, వాటికి తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి.
- Step 4
చేమగడ్డలు కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తరిగిన టొమాటో ముక్కలు, పచ్చి మిర్చి తరుగు వేసి అందులో చింతపండు పులుసు, అర కప్పు నీళ్లు పోసి, బాగా కలిపి మూత పెట్టి ఉడికించాలి.
- Step 5
చేమగడ్డలు మెత్తబడ్డ తర్వాత ఉడికించిన కందిపప్పు, తగినంత ఉప్పు వేసి కలిపి మరి కొద్దిసేపు ఉడికించాలి. చివర్లో గరంమసాలా పొడి, కొత్తిమీర వేసి కలిపి దించేయాలి.
- Step 5
వేడివేడి చేమ గడ్డ పప్పును అన్నంలోకే కాదు, చపాతీ, పూరీలోకి కూడా నంజుకోవచ్చు.