తయారు చేయు విధానం
పనీర్‌ను చతురస్రాకారంలో కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, టొమాటో, అల్లం ముక్క, పచ్చిమిర్చి కలిపి గ్రైండ్ చేయాలి కోవాను తురమాలి పాన్ మీద బటర్ లేదా నెయ్యి వేసి వేడి చేయాలి. దీంట్లో గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వేసి కలిపి, వేయించాలి సన్నని మంట మీద నెయ్యి లేదా నూనె పైకి తేలేంతవరకు అడుగు మాడకుండా ఉడికించాలి. దీంట్లో కోవా, క్రీమ్ కలిపి, రెండు నిముషాలు ఉంచాలి ఉప్పు, కారం, పసుపు, గరంమసాలా, చీజ్ కలిపిన తర్వాత అర కప్పు నీళ్లు పోయాలి. గ్రేవీ చిక్కబడ్డాక, దించి వేడి వేడిగా వడ్డించాలి. రోటీ, రైస్‌లోకి పనీర్ కుర్మా పసందుగా ఉంటుంది.