భారతీయ వంటల్లో కొత్తమీర ప్రాదన్యం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ప్రతి వంటలో కొత్తమీర వేస్తే వచ్చే ఆ సువాసన, ఆ రుచి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే కొత్తమీరతో కారం కూడా చేసుకోవచ్చు. ఈ కొత్తమీర కారం ఎలా తయారుచేసుకోవచ్చో ప్రత్యేకంగా మీ కోసం..
తయారు చేయు విధానం
ముందుగ కొత్తిమీరను కాడలు లేకుండా బాగుచేసి బాగా కడిగి గ్రైన్దర్ లో వేసి పచ్చిమిరపకాయలను కూడా కడిగి ముచికలు తీసి గ్రైన్దర్ లో వేసి ఉప్పు,పసుపు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి . ఇప్పుడు మెత్తగా రుబ్బిన కొత్తిమీర కారాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని నిమ్మరసం కలపాలి . అంతే ఘుమఘుమ లాడే నోరూరించే కొత్తిమీర కారం రెడీ ..... ఇది పప్పన్నం లోకి చాల బావుంటుంది . వేడి వేడి అన్నం లో నెయ్యి వేసుకుని తింటే చాల అద్భుతంగా ఉంటుంది