వారం రోజులైనా చక్కగా నిలవ ఉండే ‘కాకరకాయ పొడి కూర’ ఒక్కసారి చేసి ఫ్రిజ్ లో పెట్టుకుంటే, ఉద్యోగాలు చేసేవారికి ఎంతో వీలుగా ఉంటుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా !
తయారు చేయు విధానం
పొడికి చెప్పిన పదార్ధాలన్నీ మిక్సీలో పొడి చేసి పెట్టుకోవాలి. కాకరకాయలు కొంచెం పెద్ద ముక్కలు కోసి, మజ్జిగ నీళ్ళలో ఉడకబెట్టాలి, ఆ నీరంతా ఆవిరైపోవాలి కనుక, ఎక్కువ పొయ్యకూడదు. అలా ఉడికిన ముక్కలు కాసేపు ఆరనివ్వాలి. తర్వాత నూనెలో కాకరకాయ ముక్కలు వేసి, బాగా వేగాకా, ఈ పొడి కూడా వేసేసి, వేగనివ్వాలి. చక్కటి రుచికరమైన కాకరకాయ పొడి సిద్ధమవుతుంది. మీరూ ప్రయత్నించి చూడండి.