తయారు చేయు విధానం
ముందుగ ఆలు , ను బాగా కడిగి ఆలు పెచ్చు తీసి సన్నటి ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి . . తరవాత అల్లం,పచ్చిమిరపకాయలు ,టమాట లను బాగా కడిగి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి . . తరవాత జీడిపప్పులను బద్దలుగా విడదీసి పెట్టుకోవాలి .. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో నూనె ,నెయ్యి వేసి సెనగపప్పు ,మినపపప్పు ,జీడిపప్పు ,ఆవాలు ,జీలకర్ర ,ఎండుమిరప ముక్కలు ,పసుపు వేసి పోపును దోరగా వేగనివ్వాలి . దోరగా వేగిన పోపులో ఇందాక మనం పక్కన తరిగి పెట్టుకున్న కూర ముక్కలు ,కరివేపాకు ,ఉప్పు వేసి బాగా కలిపి ఐదు నిముషాలు ఉంచి ఇందాక మనం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం,టమాట ,పచ్చిమిరపల మిశ్రమాన్ని వేసి బాగా కలిపి పది నిముషాలు ఉడకనివ్వాలి . ఒకటిన్నర గ్లాసు నీళ్ళు పొయ్యాలి . నీళ్ళు బాగా పోగుతున్నప్పుడు సన్నని సెగ మీద ఉంచి బొంబాయిరవ్వ ను పోస్తూ ఉండకట్టకుండా దగ్గర పడేవరకు కలుపుతూ ఉండాలి .. ఉండకట్టకుండా బాగా కలిపి ఐదు నిముషాలు ఉంచి దించేయాలి . అంతే ఘుమఘుమలాడే మిక్స్డ్ వెజిటబుల్ ఉప్మా రెడీ