- Step 1
చేపముక్కలను శుభ్రంగా కడిగి, కొద్దిగా పసుపు మరియు ఉప్పు వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
10నిముషాల తర్వాత పాన్ లో కొద్దిగా కొబ్బరి నూనె వేసి వేడయ్యాక అందులో కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి.
- Step 3
తర్వాత అందులోనే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
- Step 4
ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మరో రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
- Step 5
అలాగేజీలకర్రపొడి మరియు ఉప్పు కూడా వేసి ఒక నిముషం వేగించాలి.
- Step 6
ఇప్పుడు టమోటో పేస్ట్ వేసి మొత్తం మిశ్రమం కలగలుపుతూ 10 నిముషాలు ఉడికించుకోవాలి.
- Step 7
పదినిముషాల తర్వాత రెడ్ చిల్లీ పేస్ట్ కూడా వేసి మరో 5నిముషాలు ఉడికించాలి.
- Step 8
తర్వాత బంగాళదుంపలు కూడా చేర్చుకోవాలి. (మీకు అవసరం అయితేనే చేర్చుకోవచ్చు). టమోటో గ్రేవీ చిక్కగా ఉడుకుతున్న సమయంలో అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చేపముక్కలను వేసి మొత్తం మిక్స్ చేసి మూత మూయాలి. మంటను పూర్తిగా తగ్గించి 10నిముషాలు ఉడికించుకోవడం వల్ల మసాలాలు చేపకు బాగా పడుతాయి.
- Step 9
చివరగా చింతపండు గుజ్జును ఉడుకుతున్న టమోటో ఫిష్ గ్రేవీలో పోసి బాగా మిక్స్ చేసి ఒక నిముషం తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి.
- Step 10
స్టౌ ఆఫ్ చేసిన తర్వాత కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి