- Step 1
ముందుగా గోంగూరను నీటిలో వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత పాన్ లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక అందులో గోంగూర ఆకులు వేయాలి.
- Step 2
పాన్ కు మూత పెట్టి మీడియం మంట మీద 5నిముషాలు మెత్తగా ఉడికించుకొని, పక్కన తీసి పెట్టుకోవాలి.
- Step 3
తర్వాత స్టౌ మీద ప్రెజర్ కుక్కర్ పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, లవంగాలు, యాలకలు, దాల్చిన చెక్క వేసి ఒకటి రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
- Step 4
తర్వాత అందులో ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చి వేసి మరో 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
- Step 5
ఇప్పుడు అందులోనే అల్లం, వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, మటన్ ముక్కలు వేసి మరో 5నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
- Step 6
తర్వాత అందులో ఉప్పు వేసి మిక్స్ చేసి మరో 5నిముషాలు ఉడికించుకోవాలి.
- Step 7
ఇప్పుడు మటన్ కు ఒక కప్పు నీళ్ళు జోడించి మిక్స్ చేసి మూత పెట్టి, లిడ్ కూడా అమర్చి, 4-5విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
- Step 8
మటన్ ఉడికిన తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక పాన్ లోకి మార్చుకొని, తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.
- Step 9
ప్పుగు మాషర్ లేదా పప్పు కట్టింతో గోంగూరను మాష్ చేసుకోవాలి. లేదా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవచ్చు.