- Step 1
ముందుగా బేబీ పొటాటోస్ ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
తర్వాత ఫ్రైయింగ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి అందులో బేబీ పొటాటోలు ఒకటి తర్వాత ఒకటి వేసి నిధానంగా ఫ్రై చేసుకోవాలి. లేదంటే మీదకు నూనె ఎగురుతుంది.
- Step 3
మీడియం మంట మీద 5 నుండి 10 నిముషాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
- Step 4
అంతలోపు, ఉల్లిపాయను పేస్ట్ చేసుకోవాలి. అలాగే టమోటోలను కూడా సపరేట్ గా గ్రైంట్ చేసుకొని ఈ పేస్ట్ ను విడిగా పక్కకు తీసి పెట్టుకోవాలి.
- Step 5
బేబీ పొటాటో ఫ్రై అయిన తర్వాత నూనె నుండి పొటాటోలను ప్లేట్ లోకి తీసి పెట్టుకోవాలి.
- Step 6
అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక అందులో జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత అందులో ఉల్లిపాయ పేస్ట్ వేసి మరో 5 నిముషాలు వేగించాలి. అలాగే పసుపు మరియు ఉప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి.
- Step 7
రెండు నిముషాలు ఉడికించి అందులో పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో టమోటో పేస్ట్ కూడా జోడించి 5 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
- Step 8
మొత్తం మిశ్రమం మిక్స్ చేస్తూ ఫ్రై చేయాలి. అందులోనే కారం, ధనియాల పొడి, మరియు గరం మసాలా వేసి మిక్స్ చేయాలి. తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకొన్న బేబీ పొటాటోలను కూడా వేసి మిక్స్ చేస్తూ వేగించుకోవాలి.
- Step 9
చివరగా బేబీపొటాటో ఫ్రై కి సన్నగా తరిగిన కొత్తిమీర తరుగును గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
- Step 10
చపాతీ లేక రైస్ లోకి ఈ టేస్టీ ఫ్రై సూపర్బ్ గా ఉంటుంది.