కాలీఫ్లవర్ విదేశాల నుండి పరిచయం అయినప్పటికీ మనదగ్గరి దీనికి ఆదరణ బాగానే ఉంటుంది. కాస్త ధర ఎక్కువైనప్పటికీ, సి విటమిన్ పుష్కలంగా ఉండటంతో దీని తీసుకోవటం చాలా మంచిది. క్యాన్సర్ నిరోధక కారకాలైన బయో ఫ్లావనాయిడ్స్ కాలీఫ్లవర్‌లో పుష్కలంగా ఉంటాయి. కాలీఫ్లవర్‌లో విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ బి1, బి2, బి3, బి5, బి6, బి9లు ఉన్నాయి. అంతేగాకుండా ప్రోటీన్లు, ఫాస్పరస్, పొటాషియంలు కూడా కలిగివుంది. అందుచేత వారానికి రెండు లేదా మూడు సార్లు క్యాలీఫ్లవర్‌ను వంటకాల్లో చేర్చుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని న్యూట్రీషన్లు అంటున్నారు. దీనిని తీసుకోడానికి ఉన్న మార్గాల్లో ఒకటి ఎగ్ తో కలిపి వండుకోవటమే. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.